వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. గాయత్రి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మోహన్‌బాబు చంద్రబాబును ఇన్‌డైరెక్ట్‌గా ఏకి పారేశారు.
see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు..
అయితే, ముక్కు సూటి తనానికి మంచు మోహన్‌బాబు మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. మనస్సులో ఏముందే అదే చెప్పే తత్వం మోహన్‌బాబు ది అన్న టాక్ టాలీవుడ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఓ విలేఖరి ఏపీ తాజా రాజకీయాలపై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా.. పై డైలాగ్‌కు అర్థం వచ్చేలా సమాధానాలు చెప్పారు. అంతేకాకుండా గాయత్రి చిత్రంలోనూ మోహన్‌బాబు తన చతురతను ఉపయోగించి పలు డైలాగ్‌లను కూడా జోడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలు, అలాగే జలీల్‌ఖాన్‌లను ఓ ఆటాడేసుకున్నాడు మంచు మోహన్‌బాబు. ఇలా అందర్నీ కలుపుతూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
see also : ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!
ఇంటర్వ్యూలో భాగంగా…
దాసరి నారాయణరావు మృతిచెందిన తరువాత తెలుగు సినీ ఇండస్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. కచ్చితంగా సీనియారిటీ ప్రకారం ఆ స్థానం మీకే చెందాలి. ఆ స్థానంలో కూర్చొని టాలీవుడ్ సమస్యలను పరిష్కరించొచ్చు కదా..!! అన్న ప్రశ్నలకు మోహన్‌బాబు సమాధానం చెప్తూ.. టాలీవుడ్ సమస్యలను సులభంగా పరిష్కరించగలను. కానీ. అందరికీ విరోధినైపోతాను అన్నారు. చిన్న నిర్మాతలు కూడా వెంట వస్తే నేను రెడీ.. కానీ వాళ్లల్లో కూడా పొలిటికల్‌గా చీలికలు వస్తుంటాయన్నారు మోహన్‌బాబు.
see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!
ఉదాహరణను గురించి చెబుతూ పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడారు మోహన్‌బాబు. ప్రజలు ఎవరికి ఓటేసింది. పలాన పార్టీ అని మీకు ఓటేస్తే.. గెలిచిన తరువాత వేరే పార్టీలోకి వెళ్లడం నీచత్వం, నికృష్టం అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తరువాత ఆ పార్టీ ఇష్టం లేకపోతే రిజైన్ చెయ్యాలి. అంతేకానీ డబ్బుపై మమకారం పెంచుకుని వేరే పార్టీలోకి వెళ్లడం సరైంది కాదంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు మంచు మోహన్‌బాబు.