ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకి త్వరలోనే పదవీ గండం ఉంది.సెంట్రల్ విమెన్ వెల్ఫేర్ బోర్డులో ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు.అయితే నిజానికి ఈ బోర్డులో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటుగా ఒక చైర్ పర్సన్ ,కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు.
see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!
ఈ క్రమంలో ఈ బోర్డులో వీరితో పాటుగా ఎంపీ బుట్టా రేణుక కూడా ఉన్నారు.ఇదే విషయం గురించి సరిగ్గా రెండు యేండ్ల కిందట అంటే 2016 జూలై 26వ తారీఖున కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీచేసింది.అయితే పార్లమెంటరీ చేసిన రిసెర్చ్ లో ఇది కూడా అభాదాయక పదవీ కింద వస్తుంది.
see also :ఏపీలో అసలు.. ప్రతిపక్షమే లేదు :మంత్రి సోమిరెడ్డి
దీంతో ఈ బోర్డులో ఉన్న ఎంపీలపై అనర్హత వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఇదే అంశం గురించి పార్లమెంటు కు కూడా నివేదించడం జరగడం తెల్సింది.ఒకవేళ ఇది అప్రూవల్ అయితే ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ అవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ వర్గాలు..