మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలకి కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజకీయ నాయకుల పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై.. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
ఇలాంటి జోకర్స్‌ను ఏపీ ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారా అని ప్రధాని నరేంద్ర మోదీ భావించినా ఆశ్చర్యపడక్కర్లేదని.. ఏపీ వ్యవహారాన్ని ఓ జోక్‌గా తీసుకుంటారు… ఈ ఎంపీలంతా జోకర్లకు తక్కువ, సీ….ఎస్‌కు ఎక్కువ అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ ఎంపీల ఆందోళన చూస్తే ఆ పార్టీకి ఉన్న అంతర్జాతీయ పేరుప్రతిష్ఠలను జాతీయస్థాయిలో మంటగలుపుతున్నట్లుగా ఉందంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. పార్లమెంటు ఎదుట ఆందోళన చేస్తోన్న టీడీపీ ఎంపీ ఫొటోను పోస్ట్‌చేసిన వర్మ, దాని కింద వివాదస్పద వ్యాఖ్యలు రాశారు. ఎంపీలు మురళీ మోహన్, గల్లా జయదేవ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, శివప్రసాద్‌లు నిరసన తెలుపుతున్న ఫొటో పై వర్మ చేసిన వ్యాఖ్యల పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.