ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుంది అనేది ఎవ్వరికి తెలియదు. ప్రేమ పుట్టిన తర్వాత సంతోషం అనే లోకం లో తేలిపోవడం మాత్రమే తెలుసు. ప్రేమ పుట్టడానికి ఏదో చేయక్కర్లేదు…సింపుల్ గా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే చాలు. అలా ఇద్దరు కన్ను కన్ను కలిసి ప్రేమ పుట్టిన వీడియో అందరి హృదయాల్ని దోచుకుంది. ఆ ఇద్దరు టీనెజర్స్ కళ్ళతో మాట్లాడుకునే ప్రేమ భాషకి అందరూ ఫిదా అవుతున్నారు.ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌కి అయితే కుర్రాలకి నిద్ర కూడా పట్టడం లేదు అంటే అతిశయోక్తి కాదు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే సోషల్ మీడియా ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే కదా. ఎవరినైనా రాత్రికిరాత్రే ఫేమస్ చెయ్యగలదు. అలాగే ఓ అమ్మాయి రెండు రోజులగా అందరి వాట్సాప్ స్టేటస్ లలో నిలవడమే కాకుండా… కొన్ని లక్షలమంది హార్ట్స్ని టచ్ చేసింది. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని అందరు ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే మీరు అంతగా కష్టపడకుండా సింపుల్‌గా ఆ క్యూటీ గురించి తెలుసుకోవచ్చు. ఆమె పూర్తి పేరు ప్రియా ప్రకాష్ వారియర్… ముద్దు పేరు రియా..
ప్రియా మొదట మోడల్.. ఆ తర్వాత యాక్టర్ అవతారం ఎత్తింది. ఒరు అధర్ లవ్ అనే మలయాళం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమాలోని పాటే ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. ప్రియ కాటుక కన్నులతో… బ్రౌన్ కలర్ కర్లీ హెయిర్ తో అందరిని ఆకట్టుకుంది… ప్రియా మెయిన్ ప్లస్ తన స్మైల్.. ప్రియా వయసు 18.. కేరళలోని త్రిసూర్‌లో జన్మించింది.. విమల కాలేజ్‌లో ప్రస్తుతం బికామ్ చదువుతున్న ప్రియా తండ్రి పేరు ప్రకాష్ వారియర్. ఇవండీ సోషల్ మీడియాలో సెన్షేషన్‌గా మారిన ప్రియా ప్రకాష్ గురించి మీకు తెలియని విషయాలు.