కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ స్థాపించిన తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయనున్న జేఏసీ ( జాయింట్ యాక్షన్ కమిషన్ )తో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదన్నారు. జేఏసీతో ప్రత్యేక హోద అసలే రాదన్నారు. ఈ సందర్భంగానే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై కూడా మీడియాతో మాట్లాడారు.
see also : టీడీపీ కంచుకోటలో.. జగన్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?
ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు అధికారం చేపట్టాక కాపులను మరిచారని విమర్శించారు. చంద్రబాబు తమను బీసీల్లో చేర్చనందునే కాపు ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ముద్రగడ పద్మనాభం.