ప్రముఖ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.సీఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన వివిధ కంపెనీల ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు.
IT & Industries Minister @KTRTRS speaking at the interactive session being held as part of Southern Regional Council Meeting of CII in Hyderabad @FollowCII pic.twitter.com/zDWiQWRQtL
— Min IT, Telangana (@MinIT_Telangana) February 10, 2018
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. భారతదేశంలోనే ఆర్థికాభివృద్ధిలో ముందున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నామని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో 14% గ్రోత్ తో ముందుకేల్లుతున్నామని స్పష్టం చేశారు.పెట్టుబడులు ఆకర్షించడంలో అందరికంటే ముందున్నామన్నారు .ఐటీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు.తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు చెప్పారు.