ఏపీ రాజధాని అమరావతి కోసం 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని అందించామని వారు బల్లగుద్ది చెబుతోంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. కేంద్ర బడ్జెట్ తర్వాత చంద్రబాబు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. దానికి కారణమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. ఆఖరికి టీడీపీ నేతలు సైతం, చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నారు.
see also : అను బేబి.. అలాంటి పనులు చేయకూడదమ్మా..!
4 వేల కోట్లు అమరావతికి ఇచ్చామని బీజేపీ చెబుతోంటే, దానికి సమాధానమివ్వాల్సిన బాధ్యత చంద్రబాబు గారిదే. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తామని నాలుగేళ్ళుగా చెబుతున్నచంద్రబాబు, ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధుల్ని దేని కోసం వాడారో రాష్ట్ర ప్రజలకు తెలియాలి.అమరావతిలో తాత్కాలిక సచివాలయం మినహా, అధికారికంగా రాజధాని పేరుతో ఒక్క భవన నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. కాబట్టి బీజేపీ చెబుతున్న లెక్కలు నిజమే అయితే 4 వేల కోట్ల రూపాయల్ని చంద్రబాబు సర్కార్ పక్కదారి పట్టించిందని అనుకోవాలి. 4 వేల కోట్ల సంగతి ఇలా ఉంటే, ఒక లక్షా డెబ్బైఆరు వేల కోట్ల రూపాయల లెక్క బీజేపీ చెబుతున్న దరిమిలా, ఆ మొత్తాన్ని రాష్ట్రంలో ఏయే కార్యక్రమాలకు ఉపయోగించిందీ చంద్రబాబు వివరించకతప్పదు.
see also : టీడీపీ కంచుకోటలో.. జగన్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?
ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు రాష్ట్ర అప్పుల మొత్తాన్ని లక్షన్నర కోట్లకుపైనే పెంచేశారు. అంటే ఆ లక్షన్నర కోట్లకీ లెక్క తేలాల్సి ఉంటుంది. 2014 నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాల్లో ప్రతిపక్షం వైసీపీ, అధికార టీడీపీటీ అవినీతిని ఎండగడుతూనే వుంది. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగమవుతోందని కాగ్ సైతం ఎండగట్టేసింది. ఇప్పటికైనా చంద్రబాబు పెదవి విప్పాల్సిందే. లేదంటే మిత్రపక్షం బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోపణల్ని అధికార పక్షం ఒప్పుకున్నట్లే అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.