రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఇది మంత్రి కేటీఆర్‌కు దక్కిన విశేష గౌరవం. అయితే ఎలా దక్కింది అనేది ఆసక్తికరం. సిరిసిల్లా నుంచి సిలికాన్‌వ్యాలీ వరకు స్వల్పకాలంలోనే సుపరిచితుడు అయినందునే ఈ రికార్డు దక్కిందని అంటున్నారు.
see also : కేటీఆర్ ఆఫీస్..కొత్త ఒరవడికి కేరాఫ్ అడ్రస్
ఓవైపు అధికారులను మరోవైపు పార్టీ నేతలను…ఇంకో వైపు కార్పొరేట్లను అన్నింటికీ మించీ సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు..మంత్రి పదవిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అనుసంధానం అయ్యేందుకు వేదికగా ఎంచుకున్న ‘ట్విట్టర్’ మాధ్యమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఖాతాలో ఈ విశిష్ట రికార్డు చేరిందని చెప్తున్నారు. ప్రాంతీయ నేతకు అతి తక్కువ కాలంలో 10 లక్షల ఫాలోవర్లు దక్కడం కేవలం మంత్రి కేటీఆర్‌కు మాత్రమే సాధ్యమయిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. పలువురు నెటిజన్లు ఈ విషయాన్ని పంచుకోవడంతో మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్టే కనెక్టెడ్ అని ట్వీట్ చేశారు.
see also : రైతులకిచ్చే పాసుపుస్తకాలపై రైతు ఫొటో మాత్రమే ఉండాలి..సీఎం కేసీఆర్