వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నల్లగొండ జిల్లా ప్రజలు తిరస్కరించటం ఖాయమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు . నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి.. త్రిపురారం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఆ తరువాత నిడమనూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుంటిపల్లి-ఎర్రబెల్లి గ్రామాలకు చెందిన రెండువందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేడరంతా టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న ఈర్ష్యతోనే ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే జానారెడ్డి వారించకపోవటం దారుణమన్నారు.