అంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడు.దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత మంత్రిగా ఉంటూ పీసీసీ పదవిని కూడా నిర్వహించారు.ఉత్తరాంధ్రను శాసించే స్థాయికి ఎదిగారు .కానీ రాష్ట్ర విభజన అంశం ఆయన్ను బాగా దెబ్బతీసింది.
SEE ALSO : ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..!
కిరణ్‌కుమార్ రెడ్డితో విభేదాలు రావడంతో ఒక దశలో సమైక్యాంధ్ర ఉద్యమం ఆయన ఇంటిపై దాడి వరకు వెళ్లింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.కొందరు టీడీపీలో చేరారు. మరికొందరు వైసీపీలో చేరారు దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంపై బొత్స పట్టు కాస్త సడలింది అయితే వైసీపీలోకి చేరిన బొత్స సత్యనారాయణ ఎన్నికలు సమీపిస్తుండడంతో తిరిగి ఫాంలోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు.
SEE ALSO : ఈర్శ్యతోనే కాంగ్రెస్ నేతల ఆరోపణలు..మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్ర విభజన సమయంలో చెల్లాచెదురైన తన కేడర్‌ను తిరిగి సంఘటితం చేసే పని మొదలుపెట్టారు.మండల, గ్రామ స్థాయి నాయకులతోనూ చర్చలు జరుపుతున్నారు. ఆపద కాలంలో తనను విడిచి వెళ్లిన నేతలను తప్పుపట్టకుండాఆ సమయంలో మీరు చేసింది సరైనదేనంటూ తనదైన శైలిలో వారికి తిరిగి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు భవిష్యత్తు లేని వేళ మీరు ఇతర పార్టీల్లోకి వెళ్లడాన్ని తానేమీ తప్పుపట్టడం లేదని.. ఇప్పుడు వైసీపీ గూటిలో అందరం కలిసి పనిచేద్దామంటూ ఆహ్వానిస్తున్నారు.
SEE ALSO : అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
ముఖ్యంగా టీడీపీలో చేరిపోయిన తన కేడర్‌ను తిరిగి వెనక్కి రప్పించడంలో బొత్స మంచి ఫలితాలనే సాధిస్తున్నారు .సిద్ధాంతపరంగా టీడీపీలో ఇమడలేకపోతున్న పాత కాంగ్రెస్ నాయకులు, అనుచరులు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు సుముఖంగానే ఉన్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో చాలా మంది మండల, గ్రామ స్థాయి నాయకులు వైసీపీలోకి చేరిపోతున్నారు. కొందరు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాకు చేరే నాటికి.. పాత కాంగ్రెస్ శ్రేణులన్నింటినీ ఇతరపార్టీల నుంచి వైసీపీలోకి రప్పించేలా బొత్స లోకల్ ఆపరేషన్ ప్రారంభించారు.
SEE ALSO : హీరో వెంకీకి తప్పని.. ఇద్దరు పిల్లల తల్లి వేధింపులు..!!
వైసీపీ తమ దివంగత ప్రియతమ నాయకుడు వైఎస్ ఆర్ కుమారుడు స్థాపించిన పార్టీనే కావడంతో టీడీపీలోకి వెళ్లిన నేతలు తిరిగి ఇటు వైపు వచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలను కూడా తెలపడం లేదు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు కూడా పార్టీ ఫిరాయించడం వల్ల బొత్సకు జగన్ మంచి ప్రాధాన్యతే ఇస్తుండడంతో ఆయన జిల్లా వైసీపీని బలోపేతం చేసేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది విజయనగరం జిల్లాలో ఈక్వేషన్లు మరింత మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు.