ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు లోక్ సభలో నిరసనలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చింది.ఈ సందర్బంగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఉయ్యూరులో చేపట్టిన నిరసన ప్రదర్శనలో భాగంగా గుండు కొట్టించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని నాలుగు రోజులుగా తెదేపా ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు కేంద్రానికి తాకాలన్న ఉద్దేశంతోనే నిరసన చేపట్టినట్లు తెలిపారు.
see also : ప్రతిష్టాత్మక ఆస్కార్ (పాలిటిక్స్)అవార్డులు… రేసులో టీడీపీ టాప్..?