సాదరణంగా యువతీ యువకులు ఎక్కువ శాతం ప్రేమించుకోవడం..పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం చూసే ఉంటాం… అయితే కొంత మంది కాలేజ్ యువత మాత్రం పెళ్లికు ముందు కొంత కాలం డేటింగ్ (సహజీవనం) చేస్తూ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు..లేదా డ్రాప్ అయిపోతున్నారు. అయితే కొంత మంది సహజీవనం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా శృంగార సమయంలో కండోమ్ వాడటం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. ఇక్కడ ఓ పరిశోధక విద్యార్థిని సహచర స్కాలర్‌కు ఓ ఆఫర్ చేసింది. సురక్షిత శృంగారం (సేఫ్ సెక్స్)కు అయితే ఓకే అని చెప్పింది. దీంతో వారిద్దరూ గత ఆరు నెలలుగా పరస్పర అంగీకారంతో సేఫ్ సెక్స్‌లో పాలుపంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ యువ స్కాలర్‌కు ఓ ఆశ కలిగింది. రక్షణ లేని సెక్స్‌లో పాల్గొనాలన్నది ఆ కోరిక.. కండోమ్ ఉన్నా, లేకున్నా తేడా ఏంటి.. చేసేది శృంగారమే కదా అని జార్జ్ వాదనకు దిగాడట. దీంతో కండోమ్ లేకుండా తనతో శృంగారానికి బలవంతం చేస్తున్నాడని ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు పీహెచ్‌డీ విద్యార్ధిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
