తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన కామెంట్లకు కట్టుబడ్డారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తాననే తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
`జీహెచ్ఎంసీ, పాలేరు ఉప ఎన్నికల్లో సవాల్ చేశాను.కాంగ్రెస్ పారిపోయింది. 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్‌కు సవాల్ చేశాను. సవాల్‌ను స్వీకరిస్తే ధైర్యంగా ముందుకు రావాలి. కుటుంబం చాటున రాజకీయాలు ఎందుకు? నా సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్‌కు ఉన్నా లేకపోయినా నేను నా మాటపై నిలబడతా. 2019 ఎన్నికల తర్వాత నేను మాట తప్పితే మీరు నన్ను పట్టుకొని అడగండి. తాడు…బొంగరం లేకుండా మాట్లాడటం కాదు..దమ్ముంటే..స్పందించాలి` అని మంత్రి కేటీఆర్ అన్నారు.
see also : టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ..!
భార్యను ఎమ్మెల్యేగా పదవిలో ఉంచిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి వారసత్వ రాజకీయాల గురించి కామెంట్ చేయడం చిత్రంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. `కుటుంబం గురించి ఉత్తమ్ మాట్లాడితే ఎలా .. నేను రాహుల్ గాంధీ కుటుంభం గురించి మాట్లాడలేనా? ఉత్తమ్‌కు కేసీఆర్‌తో పోల్చుకునే సీన్ లేదు. అయన మంత్రిగా చేశారు.. నేను కూడా మంత్రినే. నేను బచ్చా అయితే రాహుల్ కూడా బచ్చనే.. రాహుల్ కు పెళ్ళి కూడా కాలేదు` అని సెటైర్ వేశారు. ఈ దేశంలో రాహుల్‌గాంధీ కంటే పెద్ద పప్పు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. `సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిపించుకోలేని అసమర్థుడు రాహుల్. మీ నాయకుడు పప్పు అని దేశమంతా తెలుసు.. గూగుల్‌లో వెతికినా అదే వస్తుంది` అని ఎద్దేవా చేశారు. `ఉత్తమ్ ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ దద్దమ్మ అంటున్నారు. రాహుల్ ను మించిన దద్దమ్మ దేశం లో ఎవరున్నారు?`అని మంత్రి కేటీఆర్ అన్నారు.
see also : కోట్లు పోసి ఎమ్మెల్యేలను కొన్నారు! చంద్రబాబుపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..!!