పార్టీలు ఏర్పాటు చేయడం సులభమేనని ప్రజల అభిమానాన్ని పొందడమే కష్టమైన పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో నూతన పార్టీల ఏర్పాట్లపై వస్తున్న కథనాలపై మంత్రి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, పార్టీలు పెట్టుకోవచ్చన్నారు. వాటి ఫలితం ఏంటనేది ఎన్నికల్లో తెలుస్తదన్నారు. తద్వారా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు.
ఈ సందర్భంగా బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ` కేంద్ర బడ్జెట్ ఎవరిని మెప్పించలేదు. బీజేపీ కనీసం మిత్ర పక్షాలను కూడా మెప్పించలేకపోయింది. ఇంక ప్రజలను ఏం మెప్పిస్తుంది? జాతీయ పార్టీలు పనికిరావు అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు` అని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీతో ఉందా లేదా అనేది అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అంబర్ పేట్, ముషీరాబాద్ దాటి బయటకి రారని..ఆ పార్టీకి ఆదరణ దక్కేది ఎన్నడని చెప్పారు.
see also : కోట్లు పోసి ఎమ్మెల్యేలను కొన్నారు! చంద్రబాబుపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..!!
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. `రూ.40 వేల కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపితే వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాహుబలి కలెక్షన్ అంత మొత్తం కూడా కేంద్రం కేటాయించలేదు. రాష్ట్ర పథకాలను కేంద్ర మంత్రులు వచ్చి అద్భుతం అనటం తప్ప చేసిందేమీ లేదు. కాళేశ్వరం తో సహా ఏదో ఓక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ అడిగారు.. వాళ్లు ఇచ్చారా? ఎస్సీ వర్గీకరణ విషయంలో అపాయింట్‌మెంట్ ఇచ్చి రద్దు చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలు ఎందుకు అమలు చేయటం లేదో బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలి` అని మంత్రి డిమాండ్ చేశారు.
see also : హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!