మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) ఇవాళ ( ఫిబ్రవరి 7న ) మృతి చెందారు.అయన గురించి మీకు తెలియని విషయాలు..
- గాలి ముద్దుకృష్ణమనాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం
- 1947 జూన్ 9 న వెంకట్రామాపురంలో రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించారు.బీఎస్సీ ,ఎంఎతో పాటు న్యాయ వాద పట్టా పొందారు.
- గాలి ముద్దుకృష్ణమనాయుడు భార్య సరస్వతి .ఆయనకు ఇద్దరు కుమారులు.ఒక కుమార్తె ఉన్నారు ..
- గుంటూరు జిల్లా పెదనందిపాడులో అద్యాపకుడిగా పనిచేశారు.
- 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ ప్రవేశం చేశారు.
- గాలి ముద్దుకృష్ణమనాయుడు పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు.
- 1984లో విద్యాశాఖ ,1987లో అటవీ శాఖ ,1994లో విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు.
- 2004ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో కి వెళ్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు.తిరిగి 2008లో టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు.
- 2014ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి రోజా చేతిలో ఓటమిపాలయ్యారు.ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ గా సేవలందిస్తున్నారు.
- హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 7 రాత్రి 12.50గంటలకు మృతి చెందారు.
see also : దట్ ఈజ్ వైఎస్ఆర్ : వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..!!
see also : మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?