ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన ప్రభజనం మద్య కొనసాగుతుంది. ఇందులో భాగంగా 80వ రోజు సోమవారం కోవూరు శాసనసభా నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు..ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ నేతలు చేస్తున్నది రాక్షస పాలన అని ద్వజమెత్తరు.అంతేగాక చంద్రబాబు మొసలి కన్నీరు చూశాక నాకో కథ గుర్తుకొస్తోందని సభలో ఒక కథ చెప్పారు..
see also..2019 అధికారం ఎవరిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చి చెప్పిన మరో జాతీయ సర్వే..!!
కోర్టు బోనులో ఓ ముద్దాయిని నిలబెట్టారట. జడ్జి వచ్చాక ‘అయ్యా.. తల్లీదండ్రీ లేని వాణ్ని.. నాకు దిక్కెవరూ లేరు సార్. నన్ను విడిచిపెట్టండి సార్’అంటూ ఆ ముద్దాయి బిగ్గరగా ఏడుపు మొదలు పెట్టాడట. అది చూసిన జడ్జి అతన్ని ఎందుకు తెచ్చారు? ఏం తప్పు చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అడిగాడట. అప్పుడాయన ‘సార్.. ఇతనివన్నీ దొంగ ఏడుపులు. తల్లిదండ్రుల్ని అతడే చంపాడు. అందువల్లే బోనులో నిలబడ్డాడు’అని చెప్పాడట. సరిగ్గా చంద్రబాబు వైఖరి కూడా అదే విధంగా ఉంది. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం. ఆయనే లేకుంటే రాష్ట్రం కలిసికట్టుగానే ఉండేది. ప్రత్యేక హోదా రాకపోవడానికీ ఆయనే కారణం. ఆ రోజేమో ప్రత్యేక హోదా సంజీవని అన్నాడు. ఈ రోజేమో అదేమైనా సంజీవనా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని పాపాలు, నేరాలు చేసిన చంద్రబాబుకు.. కోర్టులో నిలబడి దొంగ ఏడుపులు ఏడుస్తున్న ముద్దాయికీ ఏమైనా తేడా ఉందా? దారుణం గా ప్రజలను మోసం చేయడం, అబద్ధాలా డటం, అబద్ధాలను నిజమని నమ్మించేలా చేయడం, దానికోసం అనుకూలమైన మీడియా వ్యవస్థను వాడుకోవడం చూస్తే దేశ చరిత్రలో ఇంతకన్నా అన్యాయమైన రాజకీయాలు చేయడం కేవలం చంద్రబాబు ఒక్కడికే సొంతమని వైఎస్ జగన్ అన్నారు.