ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది .రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో కృష్ణా జిల్లా రాజకీయాలు రాజకీయవర్గాలకే కాదు ఏకంగా రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టదు.మొత్తం ఏపీ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా ఉండే కృష్ణా జిల్లా టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కష్టమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.ఈ విషయం తెగేసి చెప్పాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.జిల్లాలో మొదటి వికెట్ నందిగామ అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
See Also:దేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన రాజకీయా నాయకుడు చంద్రబాబు
అయితే ఇటివల ఉప ఎన్నికలో గెలిచిన సౌమ్యకు నియోజక వర్గంలో అసలు పట్టు లేదంటా..మరో వైపు పెడన అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ,సీనియర్ నేత కాగిత వెంకట్రావును అనారోగ్య పేరిట తప్పించడానికి బాబు యోచిస్తున్నాడు.పామర్రు ఎమ్మెల్యే అయిన ఉప్పులేటి కల్పన ది వింతైన సమస్య.రానున్న ఎన్నికల్లో తన భర్తకు ఎంపీ సీటిచ్చి ఆమె స్థానంలో వర్ల రామయ్య లేదా మాజీ ఎమ్మెల్యే డీవై దాసు లలో ఒకరికి సీటివ్వడానికి బాబు రెడీ అయ్యారు.పెనమలూర్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమే కాకుండా ఏకంగా కాల్ మనీ ,కోడి పందేలు లాంటివే కాకుండా ఇసుక మాఫియా ,అక్రమ దందాలు లాంటి వాటితో ఆయన్ని పక్కకి పెట్టె అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు .
See Also:2019 అధికారం ఎవరిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చి చెప్పిన మరో జాతీయ సర్వే..!!
అయితే ఇక్కడ నుండి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బరిలోకి దిగుతాడు అని టాక్ .వీళ్ళందరిలో ముఖ్యుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ .ఇతనికి మంత్రి పదవీ రానప్పుడు వినిపించిన స్వరం ..లేటెస్ట్ గా భూ దందాలు ఇలా పలు కారణాలతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమే అని అంటున్నారు తమ్ముళ్ళు..వీళ్ళతో పాటుగా గుడివాడ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు ,తిరువూరు లో ఇప్పటికే మూడు సార్లు ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు కూడా టికెట్ కష్టమని వేరేవాళ్ళను బరిలోకి దించడానికి బాబు ప్లాన్ చేస్తున్నాడు అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.చూడాలి మరి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వీరు టీడీపీలో ఉంటారో లేదా వేరే పార్టీలోకి జంప్ అవుతారో ..?.