భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఈ మరణ వార్త విన్న టీడీపీ నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెద్ద దిక్కుగా ఉన్నా తల్లిదండ్రులను కోల్పోయి విషాదంలో ఉన్న అఖిలప్రియకు చంద్రబాబు మంత్రి పదవిచ్చారు . అయితే ఇదంత ఓకే కాని 2019 లో మాత్రం మొత్తం మారిపోతుదంట.
See Also:వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
వచ్చె సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైనట్లే. ఇప్పటికె అన్ని పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఈయన పేరు వింటేనే సర్వేలు.. సర్వే ఫలితాలు గుర్తొస్తుంటాయి.. తాజాగా లగడపాటి చేసిన సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. లగడపాటి సర్వే ఫలితాలే దాదాపు ఎన్నికల్లో నిజమవుతుండటంతో ఈయనకు ఆంధ్రా ఆక్టోపస్ అనే పేరు కూడా వచ్చింది. గతంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో లగడపాటి చెప్పిందే నిజమైంది. అలాగే కొద్దిరోజులక్రితం ఏపీలో జరుగుతున్న పరిస్థితులపై లగడపాటి సర్వే నిర్వహించారు. అందులో టీడీపీపై ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగిందని, వచ్చే ఎన్నికలల్లో వైసీపీదే అధికారమని లగడపాటి జోస్యం చెప్పారు. కర్నూల్ జిల్లా వారిగ చూస్తే ఆళ్లగడ్డలో వైసీపీ విజయం అని సర్వేలో తెలింది.
See Also:వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…
వైసీపీ నుండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె.. అఖిల ప్రియకు వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేలా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదోలా జరిగిపోయినప్పటికీ.. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొలిటికల్ సీన్‌తో పాటు ఆళ్లగడ్డలోనూ సీన్ రివర్స్ అవుతుందని చెబుతున్నారు.ఎన్నిలకు సమయం దగ్గరపడడంతో టీడీపీపై వ్యతిరేకత రావడం కూడా ఒక ప్రధానాంశంగా తెలుస్తోంది. గతంలో భూమాను ఓడించడానికి చంద్రబాబు సర్వశక్తులూ ప్రయత్నించాడు.. భూమా గెలిచిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు, కేసులు పెట్టడం.. తర్వాత మంత్రిపదవి ఆశతో పార్టీలో చేర్చుకుని మంత్రిపదవి ఇవ్వలేమని చెప్పేయడం.. దీంతో భూమా గుండెపోటుతో చనిపోయాక చేసేది లేక అఖిలప్రియకు మంత్రిపదవి ఇవ్వడం వంటి వాటిని భూమా అభిమానులు ఇంకా మరిచిపోలేదని, టీడీపీకి ఓటు వేయలేమని కొందరు చెప్పారట.. నిజానికి ప్రజాక్షేత్రంలో తన బలం నిరూపించుకునే స్థాయికి అఖిల ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోపక్క ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బంధువులు సైతం మంత్రి అఖిల మాట వినకుండా ఉండడం రాజకీయంగా చర్చనీయంశం అయ్యింది .
See Also:బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!
భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రి ఏవీ సుబ్బారెడ్డిని ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేగాక ఆళ్లగడ్డలో భూమా కుటుంబంతో పాటు.. గంగుల కుటుంబానికి కూడా పొలిటికల్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరి కుటుంబాల మధ్యనున్న వైరం అందరికి తెలిసిందే. అలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అఖిలకు గంగుల కుటుంబం నుంచి గట్టి పోటీ తప్పదని అంటున్నారు.