తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని వేగవంతంగా ముందుకు తీసుకుపోతోందని విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ యూనివర్శిటీలను పటిష్టం చేస్తోందని వివరించారు. తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల్లో 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారని ఈ సందర్బంగా ఆయన వివరించారు.
see also : తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!
విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి బిల్డింగ్ గ్రాంట్ కింద 20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈరోజు పరిపాలన భవనం కోసం 3.4 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశామన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడంలో విద్యాశాఖ పాత్ర ముఖ్యమైందని అన్నారు. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం వల్ల మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని వివరించారు. గత మూడేళ్లగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నామని, ఇంజనీరింగ్ కాలేజీలను, ప్రైవేట్ విద్యాలయాలను నియంత్రిస్తున్నామన్నారు.
see also : 79 రోజులు.. 1000 నాటౌట్.. జగన్ పాదయాత్రకు ముహుర్తం పెట్టింది ఎవరు..?
ఉత్తీర్ణులకంటే ఎక్కువగా కాలేజీలలో సీట్లు ఉండడాన్ని రెగ్యులేట్ చేశామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. గతంలో ఇబ్బడిముబ్బడిగా కాలేజీలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తగ్గాయన్నారు. తెలంగాణ వచ్చాక ఆన్‌లైన్ అడ్మిషన్లు చేస్తున్నాం…ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో చదివే విద్యార్థి 1 నుంచి 12 వరకు తెలుగు నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని దీని కార్యాచరణకోసం తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ చైర్మన్ గా కమిటీ వేశామన్నారు ఆ కమిటీ ప్రతిపాదనలు ఇచ్చారు…వీటిని ప్రభుత్వం ఆమోదించిందన్నారు. తెలంగాణలో చదివే ప్రతి విద్యార్థి తెలుగు చదవాలి, రాయాలి, మాట్లాడాలి …అందుకే తెలుగును సులభతరంగా మార్చే సిలబస్ రూపొందిస్తున్నామన్నారు. 2018-19 అకాడమిక్ సంవత్సరం నుంచి అన్ని విద్యాలయాల్లో తప్పనిసరి తెలుగు అమలు చేస్తామన్నారు.
see also :వైఎస్ జగన్ నాటకాలు ఆడుతున్నారు… చంద్రబాబు నాయుడు
see also : వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
see also : బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!