ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే… కిరాణ కొట్టోడు- కిరాణా కొట్టోడు కొట్టుకుంటే చింతపండు రేటు బయట పడినట్టు.. ఒకప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. అయితే ఈ వరుసలో రెండు పార్టీలకి చెందిన కార్యకర్తలు గత నాలుగు సంవత్సరముల నుంచి ఇప్పటివరకు చేసిన అవినీతి అక్రమ పనులను బహిరంగం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా అధికార పార్టీ అధినేత చంద్రబాబు కుంభ కోణాల్ని ఈ బీజేపీ ఎమ్మెల్సీ భయపెట్టాడు.
తాజాగా మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. కేంద్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా కొన్ని వేల కోట్లను రూపాయల బిల్లులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పంపుతోందని.. వాటిని చంద్రబాబు మింగేస్తూ.. బీజేపీ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మరో సంచలన గుట్టువిప్పుతూ.. ఏపీకి ముప్పై వేల కోట్ల రూపాయలను ఉపాధి హామీ పధకం కింద ఇచ్చామని… ఆ డబ్బలన్నీ ఏమయ్యాయని గట్టిగా ప్రశ్నించాడు. ఒక రెండు ఎకరాల ఆసామి ఇప్పుడు రెండు లక్షల కోట్లను ఎలా సంపాదించి ఉంటాడో మన అందరికి తెల్సిందే.. ఎన్నో అవినీతి పనులను చేసి అడ్డ దారులు తొక్కి ఈ డబ్బుని సంపాదించాడని మండిపడ్డారు.