టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ .. అభివృద్ధిని కోరుకొనే పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం దుర్కి, నసరుల్లాబాద్, బొమ్మనదేవపల్లి, అంకోల్, హాజీపూర్, మైలారం, అంకోల్ తండా, అంకోల్ క్యాంపు, నాచుపల్లి, మైలారం తండా, సంగెం, లింగంపల్లి తండా గ్రామాల నుంచి మొత్తం 2000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి పోచారం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ పరిపాలన, సీఎం కేసీఆర్ నాయకత్వం నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ప్రజలకు నచ్చిన పనులు, పేదల సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందునే ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.వచ్చే నెల ( మార్చి ) 11న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు . వర్షాకాలం నుంచి రైతులందరికీ ముందస్తు పెట్టుబడిగా ఎకరానికి రూ.4వేలు అందిస్తామన్నారు. వచ్చే మే 15 నాటికి గ్రామాలలో రైతులకు చెక్కులు పంపిణీ చేస్తామన్నారు.మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు.