తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిన సంచలనమే..ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టని వినూత్న,కార్యక్రమాలను , పథకాలను ప్రవేశపెడుతూ..దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు.కాగా దేశంలో మరే ప్రభుత్వం చేయనివిధంగా కంటి జబ్బులకు శాశ్వత పరిష్కారం కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శనివారం ) టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే..ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత నేత్రవైద్య శిబిరాలను నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
see also :బ్రేకింగ్ : నిరుద్యోగులకు టీ సర్కార్ మరో శుభవార్త..!
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అనేక చిన్న చిన్న కారణాల వల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రజల్లో కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున కంటి జబ్బులకు చికిత్స పొందడం వారికి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆసుపత్రులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గ్రామీణ ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం, పరీక్షలు చేయించుకొని చికిత్స పొందడం వ్యయభారంగా మారింది.చాలామంది కంటి అద్దాలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు.కాబట్టి వీటన్నింటికీ ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది. అన్ని కోణాల్లో ఆలోచించి కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం.దీనికింద ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున శిబిరాల నిర్వహణ కార్యక్రమాన్ని చేపడతాం. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి .స్వచ్ఛంద సంస్థలకు సైతం భాగస్వామ్యం కల్పిస్తాం.వీటికయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని తెలిపారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆయనకు పెద్దఎత్తున అభినందనలు తెలియజేశారు.
see also : జగన్‌ని కలిసిన గౌతమ్ రెడ్డి.. వెంటనే వంగవీటికి ఫోన్ చేసిన జగన్..!
see also : టీ బీజేపీకి బిగ్ షాక్..టీఆర్‌ఎస్ లోకి సీనియర్ నాయకుడు..!