ఏఎన్ఎంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీపికబురు అందించారు. యూరోపియన్ కమిషన్ కింద 2003లో నియామకమైన 710 మంది ఏఎన్‌ఎంలకు వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదివేలుగా అందుతున్న వేతనాన్ని రూ.21,000కు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వారి వేతనాల పెంపునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
see also : కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష….మంత్రి కేటీఆర్ కీలక పిలుపు
కాగా, రెండో ఏఎన్‌ఎంలకుసంబంధించిన వేతనాల పెంపుపై సైతం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రితో పాటుగా, ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించారు. వీరి ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకొని త్వరలో నిర్ణయం వెలువరించనున్నట్లు ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.