దేశంలో లైంగిక వేదింపులు ,రేప్ లు, అక్రమ సంబందాలు విపరీతంగా పేరిగిపోతున్నాయి. వీటి వల్ల నేరాల సంఖ్య దారుణంగా పెరుగుతుంది. ఇందులో ఉద్యోగస్తులు కూడ ఉండడం మరి దారుణం. తాజాగా ఓ యువకుడితో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచరమ్మ రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ రాసలీలల వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో ఓసూరులో సంచలనం సృష్టించింది.
కృష్ణగిరి జిల్లా, నెల్లూరు గ్రామంలోని పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో 45 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆ పాఠశాలలో 168 విద్యార్థులు చదువుతున్నారు.ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన టమోటా గిడ్డంకిలో పనిచేస్తున్న యువకుడితో టీచర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ సన్నిహితంగా వుండిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది.ఈ వీడియోలను టీచర్‌తో పడక పంచుకున్న యువకుడే యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఇంకా 15 వీడియోలు తన వద్ద వున్నాయంటూ చెప్తున్నాడు. వీడియోలను అప్లోడ్ చేసిన యువకుడు అదే వీడియోలో మాట్లాడుతూ.. వాట్సాప్ ద్వారా టీచర్‌తో పరిచయం ఏర్పడిందని.. తాను ఆ టీచర్‌తో కలిసి ఓసూరు, రాయకోట్టై, బెంగళూరుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగామని తెలిపాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు.