తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా ఇవాళ రూ.14.98 కోట్లతో చేనేత పార్క్ కు ,రూ 26 కోట్లతో మున్సిపల్ శాఖ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే,కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా..కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసూకుంటాడా..? ప్రజలపై మాకు అంత నమ్మకముందన్నారు.గద్వాలలో మొదలైన ఈ జైత్రయాత్ర రాష్ట్రమంతా సాగుతదన్నారు .మనకు కావాల్సింది సొంత ఆస్తులు పెంచుకునే నాయకులు కాదు…ప్రజలకు సేవ చేసే కేసీఆర్ గారిలాంటి నాయకుడు కావాలని చెప్పారు.ఈ సందర్బంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ ను ఉద్దేశించి గడ్డాలు పెంచిన ప్రతొక్కడు గబ్బర్ సింగ్ కారు అని అన్నారు.ఏం చేసిందని కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేస్తారు..కాంగ్రెస్ ఎక్కడి నుండి 70 సీట్లు గెలుస్తుంది..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తుంది .రాహుల్‌గాంధీ సొంత సీటులోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అని అన్నారు.