తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కెటిపిఎస్ ఏడవ దశ నిర్మాణంలో భాగంగా బాయిలర్ ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యాలతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామని, ఈ లక్ష్యం నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. తక్కువ సమయంలో నిర్మిస్తుున్న కెటిపిఎస్ ను స్పూర్తిగా తీసుకుని భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ఇవాళ ( బుధవారం) ఉదయం జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
see also: హుదూద్ రావాలని కోరుకున్న వ్యక్తి… ”వైఎస్ జగన్”
see also : ఏపీకి గత నాలుగేళ్లుగా ”చంద్రబాబా” గ్రహణమే.. ఈ గ్రహణం మమ్మల్ని ఏం చేయలేదు..!
see also : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్లో దుసుకుపోతున్న కారు..!