ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర ప్రారంభించి వెయ్యి కిలోమీటర్ల మైలురాయి అందుకున్నారు. నవంబర్ 6 నుండి ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల చేరుకున్నాడు. వైయస్ జగన్ రాక కోసం నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యికిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంటున్నందున స్థానిక ప్రజలు 25 అడుగుల స్థూపాన్ని వైఎస్ జగన్ తో ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామం నిండా ఫ్లైక్సీలు, రంగు రంగుల ముగ్గులు, పూల స్వాగతాలను ఏర్పాటు చేశారు. మరి వెయ్యి కిలోమీటర్ల యాత్ర ద్వారా జగన్ ఏం సాధించారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
see also : ఢిల్లీని టచ్ చేసిన.. జగన్ ప్రభంజనం… బ్రదర్స్ మతులు పోవాల్సిందే..!
పాదయాత్ర ద్వారా పార్టీని జనంలోకి తీసుకెళ్లడంలో జగన్ కొంత వరకూ విజయవంతమయ్యారు. అలాగే వచ్చే ఎన్నికల కోసం రూపొందించిన నవరత్నాల హామీలను కూడా జగన్ జనంలోకి తీసుకెళ్తున్నారు. జగన్ యాత్రకు ప్రజల నుంచి కూడా మంచి స్పందనే కనిపిస్తోంది. ఐతే..జగన్ ప్రసంగాలు కూడా మరింత ఆకట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటివరకూ పాస్ పార్కులు పొందిన పాదయాత్ర ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటే 2019లో ఖచ్చితంగా వైసీపి విజయం సాధిస్తుంది అని సినీయర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీన్ని బట్టి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి చేసుకోని…ఏం సాధించాడు అంటే ప్రజలు ఆలోచించే విదంగా …చంద్రబాబు చేసిన అపద్దపు వాగ్దానాలను..యువత లో చైతన్యం మరి ముఖ్యంగా 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు…అనే దాన్ని హైలేట్ చేశాడు.
see also.. నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లను…నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా వైసీపీనే