రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోఅన్ని పార్టీ లు కలిసి పోటీ చేసిన.. టీఆర్ఎస్ పార్టీ యే గెలుస్తుందని..వార్ వన్ సైడ్ అవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ మంగళవారం ఆమె రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ని కలిశారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలు , ప్రాజెక్ట్లను నిర్మిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుకి వెళ్లి అడ్డుకుంటున్నాయని అన్నారు.తెలుగుదేశం పార్టీ నేత ఒంటరు ప్రతాప్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేసే అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్నారు.
see also : ఆ పుకార్లను నమ్మవద్దు..TSPSC సూచన
తెలుగుదేశం పార్టీని అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలన్న టీడీపీ నేత మోత్కుపల్లి వాఖ్యాలను స్వాగతిస్తున్నామని ఈ సందర్బంగా పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ పై అఖిలపక్షాన్ని త్వరలోనే డిల్లీకి తీసుకేల్లుతామన్నారు . గతంలో ఆరుగురు మహిళా మంత్రులు చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే చేశారన్నారు.అసెంబ్లీలో రెండు నిమిషాలు నిలబడి మాట్లాడలేని వారు..కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనడం విచిత్రంగా ఉందన్నారు. నల్లగొండలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.ప్రతిపక్షాల దురాలోచన వల్లే సింగరేణి డిపెండెంట్ నియామకాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులు వీలైనంత త్వరలో న్యాయం చేస్తామన్నారు.త్వరలో సీఎం సింగరేణి యాత్ర ఉంటుందన్నారు.
see also : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి…ఏం సాధించాడో తెలుసా
see also : కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే