జామకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికి తెలిసిన విషయమే . సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా జామపండ్లు లబిస్తాయి.అయితే గర్బాధారణ సమయంలో గర్బినిలు జామ పండ్లను తీ సుకోవడం వలన ఎక్కువ లాభాలను పొందవచ్చు.జామపండ్లు మహిళలకు ఎంతో మేలు ను చేస్తాయి . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జామపండ్లలో మిటమిన్ సి పుష్కలంగా లబిస్తుంది.ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.జామపండ్లను తీ సుకోవడం వలన ఇది గర్బాధారణ సమయంలో ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
గర్బిణీ మహిళలు అధిక రక్తపోటు సమస్యకు గురి అవుతూ ఉంటారు.గర్బాధారణ సమయంలో ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.ఈ సమస్యను ఎదుర్కోవడానికి పండిన జామపండును తినడం వలన అధిక రక్తపోటును ఇది తగ్గిస్తుంది.దాంతో పాటు గర్బస్రవం కాకుండా కాపాడుతుంది.
గర్బిణీ స్త్రీ లతో పాటు వారి కడుపులో పెరిగే శిశువుకు కుడా తగినంత పోషకాలు తప్పనిసరిగా అందాలి.జామపండులో పిండం పెరుగుదలకు అవసరమయ్యే అత్యవసర పోషకాలు సమృద్ధిగా లబిస్తాయి.దాంతో పాటు తల్లికి సరిపడా పోషకాలు కూడా అందుతాయి.
గర్బిణీ స్త్రీ లు అజీర్తి మరియు జీర్ణ సమస్యలకు గురి అవ్వడం సాధారణం.అయితే తరుచుగా జామపండు తీ సుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అంతేకాకుండా కడుపులో మంట,వికారం ,మలబద్దకం వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.
జామకాయలో పోలిక్ యాసిడ్ మరియు మిటమిన్ బి9 పుష్కలంగా ఉంటాయి .ఇవి గర్బిణీ మహిళలకు చాలా అవసరం.అందువల్ల గర్బాధారణ సమయంలో జమపండును తీ సుకోవడం వలన శి శువు నాడీ వ్యవస్థ మరియు మెదడు అభివృద్ధి బాగా జరుగుతుంది.
జమాపండును తినడం వలన గర్బాధారణ సమయంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.ఇందులో వుండే మిటమిన్ సి ఉదయం పూట ఏర్పడే సిక్ నెస్ మరియు వికారం,వాంతి అయ్యే లక్షనాలను భాగా తగ్గిస్తాయి .
జామాలో వుండే యి రాన్ మరియు కాల్షియం గర్బిణీ మహిళలకు చాలా అవసరం ఇందులో వుండే ఐరాన్ రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయి లను కంట్రోల్ చేయడానికి ఎంతో సహాయపడుతా యి .అందువల్ల గర్బిణీ మహిళలు జామపండును తరుచుగా తినడం చాలా మంచిది.